చక్కటి ఫ్యామిలీ సాంగ్ తో వచ్చిన ‘లక్కీ భాస్కర్‘

‘ఓజీ‘ రావాల్సిన సెప్టెంబర్ 27నే విడుదల తేదీ ఖరారు చేసుకున్న మరో చిత్రం ‘లక్కీ భాస్కర్‘. అయితే.. ‘దేవర‘ అదే డేట్ కి ఫిక్సవ్వడంతో ‘లక్కీ భాస్కర్‘ మరో తేదీకి షిఫ్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వస్తే.. ఆగస్టు 15నే ‘లక్కీ భాస్కర్‘ విడుదలవ్వచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘శ్రీమతి గారు‘ అంటూ సాగే ఫక్తు ఫ్యామిలీ సాంగ్ రిలీజయ్యింది. ‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు..‘ అంటూ దుల్కర్ పాడితే.. ‘సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరుకి నెగ్గేది మీ మగవారు‘ అంటూ మీనాక్షి సందడి చేస్తున్న ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతంలో శ్రీమణి రాసిన ఈ గీతాన్ని విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించారు.

Related Posts