HomeMoviesటాలీవుడ్మొదలైన సల్మాన్-మురుగదాస్ ‘సికందర్‘

మొదలైన సల్మాన్-మురుగదాస్ ‘సికందర్‘

-

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సౌత్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మురుగదాస్ కాంబినేషన్ లో సినిమాకి శ్రీకారం జరిగింది. ‘సికందర్‘ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. సల్మాన్ ఖాన్ తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ మురుగదాస్.

సాజిద్ నదియడ్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో సల్మాన్ కి జోడీగా రష్మిక నటిస్తుంది. 2025, ఈద్ కానుకగా ‘సికందర్‘ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక.. ఇప్పటికే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో తన ‘గజిని‘ రీమేక్ గా ‘గజిని‘.. ‘తుపాకీ‘ రీమేక్ గా అక్షయ్ కుమార్ తో ‘హాలిడే‘ సినిమాలను తెరకెక్కించాడు మురుగదాస్. ఇప్పుడు మరో సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తో ‘సికందర్‘ని తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈసారి సల్మాన్ కోసం స్ట్రెయిట్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు మురుగదాస్.

ఇవీ చదవండి

English News