‘కన్నప్ప‘ టీజర్.. విజువల్ ఫీస్ట్ అందిస్తున్న విష్ణు ప్రయత్నం

శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో రూపొందుతోన్న బడా మల్టీస్టారర్ ‘కన్నప్ప‘. మంచు విష్ణు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి బడా స్టార్స్ నటిస్తున్నారు. ఆమధ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం టీజర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. టీజర్ కు.. కేన్స్ ఫెస్టివల్ లో మంచి స్పందన దక్కిందని విష్ణు స్వయంగా ప్రకటించాడు. ఇక.. లేటెస్ట్ గా ‘కన్నప్ప‘ టీజర్ ను గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేసింది టీమ్.

‘ఓం నమ: శివాయ‘ అని కన్నప్ప చెప్పే మంత్రంతో మొదలైన టీజర్ లో.. కాలాముఖ అనే విలన్ ప్రత్యక్షమవుతాడు. వాయులింగాన్ని పెకిలించుకు రమ్మని కాలాముఖ పంపించిన యాభై మందిని.. ఇక.. వంద మందిని సైతం ఒంటి చేత్తో చంపే సత్తాగల అతని తమ్ముడు టెంకనను చంపింది.. ఒకే ఒక్కడు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు కాలాముఖ. ఆ ఒక్కడే తిన్నడు. అది కన్నప్ప అసలు పేరు. ఇక.. యాక్షన్ ఘట్టాలు ప్రధానంగా సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఓ యోధుడిగా కనిపించే కన్నప్ప సాహసాలను టీజర్ లో హైలైట్ చేశారు. మధ్యలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్, ప్రభాస్, శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ విజువల్స్ కూడా ఈ టీజర్ లో కనిపించాయి. న్యూజిలాండ్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన విజువల్స్ బాగున్నాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. త్వరలోనే.. ‘కన్నప్ప‘ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts