దసరా బరిలోకి దూకుతోన్న ‘కంగువ’

దసరా సీజన్లో రష్ పెరుగుతుంది. తెలుగు నుంచి దసరా బరిలో రావాల్సిన ‘దేవర’ వాయిదాపడింది. ఇక.. ఇప్పటివరకూ దసరా సీజన్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘వెట్టైయాన్’ ఒకటే విడుదలకు ఉంది. లేటెస్ట్ గా దసరాకే విడుదల తేదీ ఖరారు చేసుకుంది మరో క్రేజీ మూవీ ‘కంగువ’. ఈ సినిమా దసరా బరిలో రజనీకాంత్ ‘వెట్టైయాన్’తో పాటు అక్టోబర్ 10న విడుదలకు ముస్తాబవుతోంది.

సూర్య నటిస్తున్నపాన్ వరల్డ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’. కమర్షియల్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ కాగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వీటితో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

త్రీడీలోనూ సందడి చేయనున్న ‘కంగువ’ పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

Related Posts