తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి‘ మొదటి రోజు కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణ కలుపుకుని మొత్తంగా మొదటి రోజు రూ.38.09 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. గ్రాస్ లెక్కలు చెప్పుకుంటే ఈ అమౌంట్ కి డబుల్ ఉండొచ్చు. ఇక.. నైజాంలో తొలిరోజు రూ.16.03 కోట్లు కొల్లగొట్టిన ‘కల్కి‘.. ఉత్తరాంధ్ర రూ.4.55 కోట్లు, గుంటూరు రూ.2.72 కోట్లు, నెల్లూరు రూ.1.20 కోట్లు, కృష్ణా రూ.2.41 కోట్లు, తూర్పుగోదావరి రూ.3.34 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.2.47 కోట్లు, సీడెడ్ రూ.5.10 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ లో తొలిరోజు ‘కల్కి‘ అరుదైన రికార్డును కొల్లగొట్టింది. విడుదలకు ముందే ప్రి సేల్స్ రూపంలో దాదాపు 4 మిలియన్ల డాలర్లు కొల్లగొట్టిన ‘కల్కి‘.. మొత్తంగా తొలి రోజు రూ.5.5 మిలియన్ల డాలర్లు వసూలు చేసిందని వినిపిస్తుంది. ఈనేపథ్యంలో.. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవబోతుంది ‘కల్కి‘.
‘కల్కి‘ చిత్రానికి లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. గురువారం సినిమా విడుదలకావడంతో.. ఇంకా శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా ‘కల్కి‘ వసూళ్లకు ఢోకా ఉండదు. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో ‘కల్కి‘ భారీగా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.