‘కల్కి’ పార్ట్-2 అప్పుడే సగం పూర్తయ్యింది

‘కల్కి’ చిత్రానికి సీక్వెల్ గా ‘కల్కి 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ గురించి ఎలాంటి అప్డేట్ అందించకపోయినా.. సినిమా చివరిలో తర్వాతి భాగంపై క్రేజీ అప్డేట్ ఇచ్చింది టీమ్. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్ లో కాశీ, కాంప్లెక్స్, శంభాల ప్రాంతాలను ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అసలు కథ మొత్తం సీక్వెల్ లోనే మొదలవుతోంది. సీక్వెల్ లో ప్రభాస్ చేసిన భైరవ, కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ పాత్రల మధ్య వార్ మామూలుగా ఉండదు.

ఇక.. లేటెస్ట్ గా ‘కల్కి 2’కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత అశ్వనీదత్. ‘కల్కి’ పార్ట్-2కి సంబంధించి ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందట. కొన్ని మేజర్ పోర్షన్స్ మాత్రమే చిత్రీకరించాలట. త్వరలోనే.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇవ్వనున్నారట నిర్మాత అశ్వనీదత్. ఈ న్యూస్ తో రెబెల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related Posts