ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నారు. ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్ ఓ రేంజులో ఉండబోతుంది. అలాంటి సందర్భం ఆగస్టు 15న రాబోతుంది.

అసలు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ రావాల్సి ఉంది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ఈ సినిమా డిసెంబర్ 6 కి షిప్టయ్యింది. ఈనేపథ్యంలో.. ఆగస్టు 15 డేట్ కి రష్ పెరుగుతుంది. ఇప్పటికే తెలుగు నుంచి రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‘తో పాటు.. నార్నే నితిన్ ‘ఆయ్‘, నివేదా థామస్ ‘35‘ సినిమాలు ఆగస్టు 15కి విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి.

లేటెస్ట్ గా విలక్షణ నటుడు విక్రమ్ ‘తంగలాన్‘ కూడా ఆగస్టు 15 వైపే చూస్తుంది. విక్రమ్ లోని నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే చిత్రంగా ‘తంగలాన్‘కి మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఈ మూవీలో విక్రమ్ మేకోవర్ నెవర్ బిఫోర్ గా ఉందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి.బ్రిటిషర్స్ పాలిస్తున్న సమయంలో జరిగిన కొన్ని ఊహాజనితమైన కథాంశాల ఆధారంగా ఈ సినిమాని పా.రంజిత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందుతోన్న ‘తంగలాన్‘ ఆగస్టు 15న రానుందట.

Related Posts