‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మంచి మాస్ బీట్ ‘స్టెప్పామార్‘ సాంగ్ ఫస్ట్ సింగిల్ గా రిలీజయ్యింది.

భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సాహితీ ఆలపించారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్ లో హై ఎనర్జిటిక్ స్టెప్స్ తో అదరగొట్టాడు రామ్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ వేసిన కొన్ని స్టెప్స్ కి థియేటర్లలో విజిల్స్ గ్యారంటీ.

Related Posts