ట్రిపుల్ ఫైవ్ నంబర్ కి చేరిన ‘కల్కి‘ కలెక్షన్స్

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘కల్కి‘ లేటెస్ట్ కలెక్షన్స్ పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. గురువారం విడుదలైన ‘కల్కి‘ సినిమాకి లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. గురు, శుక్ర, శని, ఆదివారాలు కలుపుకుని మొత్తంగా నాలుగు రోజులకు రూ.555 కోట్లు వసూలు చేసింది. ఈ ఫిగర్ ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.

‘కల్కి‘ సినిమాకి ఇకపై అసలైన పరీక్ష. ఎందుకంటే.. వీకెండ్ కావడంతో కలెక్షన్లకు ఢోకా ఉండదు. అయితే.. సోమవారం నుంచి వర్కింగ్ డేస్. ఈ నేపథ్యంలో.. ‘కల్కి‘కి ఈ వారం ఎలాంటి వసూళ్లు లభిస్తాయనేది ఎంతో ప్రధానం. ఈ వారం వచ్చిన వసూళ్లను బట్టే.. లాంగ్ రన్ లో ‘కల్కి‘ ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొడుతోంది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక.. విడుదల తర్వాత ఎలాంటి పబ్లిసిటీ ఈవెంట్స్ నిర్వహించలేదు టీమ్. మరి.. త్వరలోనే ఈ మూవీ గురించి ఏమైనా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తారేమో చూడాలి.

Related Posts