‘కల్కి’ సెన్సార్ రిపోర్ట్ అదిరింది

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 A.D’ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బృందం నుంచి ఈ సినిమాకి విజువల్ అండ్ ఎమోషనల్ మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన నాగ్ అశ్విన్.. విజువల్ గా ఆ న్యూ వరల్డ్ ని అద్భుతంగా చూపించాడనే ప్రశంసలు అందుకుంటున్నాడు. అలాగే.. ఈ సినిమాలోని ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయంటున్నారు.

ప్రభాస్, దీపిక మొదలుకొని లెజెండరీ యాక్టర్స్ అమితాబ్, కమల్ రోల్స్ మూవీలో ఎంతో హైలైట్ గా ఉండబోతున్నాయని వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ విజన్ కి.. వైజయంతీ ప్రొడక్షన్ వేల్యూస్ తోడై.. ‘కల్కి’ అత్యద్భుతమైన విజయం సాధించొచ్చనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.

‘కల్కి’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతుంది టీమ్. ఇప్పటికే ఆ ట్రైలర్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ‘కల్కి’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts