గోదారి యాసతో రానున్న విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఇప్పటికే సితారతో చేస్తున్న చిత్రం పట్టాలెక్కింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్న విజయ్.. దిల్‌రాజు బ్యానర్ లోనూ మరొక చిత్రంలో నటించనున్న సంగతి తెలిసింది.

‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ దేవరకొండ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటించే సినిమాకి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఆద్యంతం గోదావరి జిల్లాల యువకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం చిత్రబృందం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తుంది. ‘యాక్టింగ్ వస్తే చాలు.. తెలుగొస్తే సంతోషం… గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు’ అంటూ విభిన్నంగా కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చింది. దీన్ని బట్టి ఈ మూవీలో విజయ్ దేవరకొండ.. గోదారి యాసతో అదరగొడతాడనిపిస్తుంది.

Related Posts