‘కల్కి’ ముంబై ఈవెంట్ గ్రాండ్ సక్సెస్

పాన్ ఇండియా వైడ్ ‘కల్కి’ సందడి మొదలయ్యింది. నిన్న ముంబైలో ‘కల్కి’ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి చిత్రంలో నటించిన ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా హోస్ట్ గా వ్యవహరించాడు.

‘కల్కి’లో తాను భాగస్వామ్యం అవ్వడం గ్రేట్ హానర్ గా ఫీలవుతున్నానని లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అన్నారు. నాగ్ అశ్విన్ విజన్ కు ఫిదా అయిన అమితాబ్.. అసలు ఇలాంటి ఐడియాలు రావడానికి అతను ఏమి తాగుతాడు అని రానా ప్రశ్నకు ఆయన సరదాగా సమాధానమిచ్చారు. అలాగే.. ఈ కార్యక్రమంలో అమితాబ్ వైజయంతీ అధినేత అశ్వనీదత్ కాళ్లకు మొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అశ్వనీదత్ చాలా హంబుల్ గా ఉంటారని తెలిపారు బచ్చన్. ‘కల్కి’ సినిమా మొదటి టిక్కెట్టును అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు.

విశ్వ నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఆర్డినరీగా కనిపించే నాగ్ అశ్విన్ ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ చేశాడని తెలిపారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి ని అద్భుతంగా తీశాడని ప్రశంసించారు కమల్. ఈ సినిమాలో తన లుక్ కోసం చిత్రబృందం ఎంతో కేర్ తీసుకుందని.. అందుకోసం చాలాసార్లు లాస్ ఏంజెల్స్ వెళ్లారని తెలిపారు కమల్.

అమితాబ్, కమల్ వంటి గ్రేటెస్ట్ లెజెండ్స్ తో పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ తెలిపాడు. ఇక.. ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన దీపిక తో నటించడం చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని ప్రభాస్ అన్నాడు.

‘కల్కి’ కోసం ఓ కంప్లీట్ న్యూ వరల్డ్ ని సృష్టించారని.. ఇలాంటి యూనివర్శ్ లో తానూ భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని దీపిక తెలిపింది. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ‘కల్కి’ అని తెలుపుతూ.. ఒక యాక్టర్ గా తనకు ఈ సినిమా చాలా మంచి ఎక్స్ పీరియన్స్ అందించిందని చెప్పింది దీపిక. ఇక.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతను పెట్టిన ఫుడ్ వలనే తాను ఇలాగ ఉన్నానని ఫన్నీగా చెప్పింది. అతని ఇంటి నుంచి ఫుడ్.. ఓ క్యాటరింగ్ సర్వీస్ లా వచ్చేదని తెలిపింది.

మొత్తంమీద.. ‘కల్కి’ ముంబై ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తుంది టీమ్.

Related Posts