ఓటీటీ లోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ‘

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ‘. ‘గూఢచారి, మేజర్’ వంటి మూవీస్ లో తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. ఈ మూవీకి స్క్రీన్ ప్లే సమకూరుస్తూనే.. ప్రెజెంటర్ గా వ్యవహరించాడు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. జూన్ 7న విడుదలైన ‘సత్యభామ‘కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

అంతకుముందు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో మెరిసిన కాజల్ కి ‘సత్యభామ‘ ఒక విధంగా ఛాలెంజింగ్ రోల్. ఈ సినిమాలో షీ టీమ్ డిపార్ట్ మెంట్ లో ఏసీపీగా సత్య పాత్రలో అదరగొట్టింది కాజల్. ఉమెన్ ట్రాఫికింగ్, గేమింగ్, టెర్రరిజం, మెడికల్ మాఫియా ఇలా చాలా అంశాలను ఈ చిత్రంలో చర్చించారు. తాజాగా ‘సత్యభామ‘ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది.

Related Posts