కాజల్ ‘సత్యభామ‘ కోసం రంగంలోకి నటసింహం

హిందూపురం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ.. మొన్నటివరకూ ఎన్నికల ప్రచారంలో అస్సలు ఖాళీ లేకుండా గడిపేశాడు. ఎన్నికలు ముగిశాయి. దాంతో.. మళ్లీ షూటింగ్స్ మోడ్ లోకి వచ్చేశాడు. తన మోస్ట్ అవైటింగ్ ‘ఎన్.బి.కె. 109‘ సెట్స్ లోకి ఇటీవలే అడుగుపెట్టాడట. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు బాలయ్య.. అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ‘ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. తన ‘భగవంత్ కేసరి‘ బ్యూటీ కాజల్ కోసమే ఈ ఈవెంట్ కి హాజరవుతున్నాడట నటసింహం. మే 24న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఐ.టి.సి. కొహినూర్ లో ‘సత్యభామ‘ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగబోతుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది చిత్రబృదం.

‘సత్యభామ‘ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకోసం తన మేకోవర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుందట కాజల్. పోలీస్ రోల్ కోసం ఎంతో హోమ్ వర్క్ చేసిందట. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చి, నిర్మించిన ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. మే 31న ‘సత్యభామ‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts