క్రికెటర్ గా మారడానికి కఠోర శ్రమ చేసిన జాన్వీ

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి నటీనటులు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఆయా పాత్రల్లో జీవించడం కోసం.. కొన్నిసార్లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్ అప్ కమింగ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి‘ కోసం అలాంటి శ్రమే చేసింది. అస్సలు క్రికెట్ ఆట గురించి పెద్దగా అవగాహన లేని.. స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ లేని జాన్వీ కపూర్.. ఈ మూవీకోసం ఏకంగా 150 రోజుల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకుందట.

‘150కి పైగా రోజుల శిక్షణ, 30 రోజులకు పైగా షూటింగ్, రెండు గాయాలు, ఒక చిత్రం’ అంటూ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి‘లో తన క్రికెట్ ట్రైనింగ్ కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి‘ మే 31న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts