ఈ మాత్రం ‘స్పై’ కి శేష్‌ పై సెటైరా.. ?

తెలుగు ఆడియన్స్ కు స్పై మూవీస్ లోని టేస్ట్ ను పర్ఫెక్ట్ గా చూపించిన హీరో అడవి శేష్‌. గూఢచారితరహా చిత్రాలు మనకు అంతకు ముందు కూడా చాలానే ఉన్నా.. ఈ తరం ఆడియన్స్ తో పాటు ఆ తరం ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటూ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఓ రేంజ్ థ్రిల్లర్ ను చూపించాడు. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోలు కూడా అతని అభిమానులయ్యారు. ఈ చిత్రంలో శేష్ కూడా రా ఏజెంట్ కావాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో చాలాసార్లు ఫెయిల్ అవుతాడు. అయినా పట్టు వదలకుండా.. ప్రయత్నించి సక్సెస్ అవుతాడు. అలాగే మూవీలో అతను కూడా రా చీఫ్ ఆగ్రహానికి గురవుతాడు. తర్వాత సీక్రెట్ ఆపరేషన్ లా ఆఖరికి అంతా ఓకే అనిపించేస్తుంది.


సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ వచ్చింది స్పై మూవీ. బట్ ఈ స్పై లో మినిమం స్పైస్ లేదు. అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో వచ్చింది. నిఖిల్ ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోవాలనే తాపత్రయంలో చేసిన సినిమాలా కనిపించింది తప్ప.. అసలు పసలేదు. అలాంటి సినిమాతో అతను ఏకంగా అడవి శేష్ గూఢచారిపై సెటైర్ వేయడం విశేషం.


స్పై చిత్రంలో హీరో నిఖిల్, అభినవ్ గోమటం శ్రీలంకలో ఓ ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇండియాలోని రా ఆఫీస్ కు వస్తారు. ఆఫీస్ లో సీక్రెట్ లాక్ లు లేవని.. భూమి అడుగు భాగానికి వెళ్లి టైలర్ షాప్ లో కోట్స్ తీసుకోవడం లేదా అంటూ సెటైరికల్ గా అంటాడు.

ఈ ఎపిసోడ్ అంతా గూఢచారి సినిమాలో కనిపిస్తుంది. అంటే గూఢచారిలో చూపించింది నిజం కాదు.. మేం చూపించే అసలైన వాస్తవ కథ అని చెప్పడం వారి ఉద్దేశ్యమా లేక.. గూఢచారికంటే గొప్ప సినిమా తీశాం అంటూ ఇన్ డైరెక్ట్ గా ఆ సినిమాపై కావాలనే సెటైర్ వేశారా అంటూ ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. నిజంగానే ఆ సెటైర్ చూడగానే ప్రతి ఒక్కరికీ గూఢచారి సినిమానే గుర్తొస్తుంది.


ఇక గూఢచారిలోని ఆ సీన్ కూడా తెలుగులో మాత్రమే వచ్చింది కాదు. అనేక భాషల్లోని స్పై, సీక్రెట్ ఏజెంట్స్ వాడే ఆఫీస్ లు అన్నీ అలాగే డిజైన్ అవుతాయి. అలాగే కొత్తగా ఏజెన్సీలోకి వచ్చే ఆఫీసర్స్ ను కూడా అలాగే పరిచయం చేస్తారు. దాన్ని శేష్ తెలుగులో చేస్తే.. అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న స్పై టీమ్ సెటైర్ వేసిందన్నమాట.

Related Posts