రాహుల్ రవీంద్రన్ ప్రయత్నం ఫలిస్తోందా..!

నటులు దర్శకులుగా మారడం.. దర్శకులు నటులుగా మారడం.. ఈమధ్య ఎక్కువగా జరుగుతుంది. ఈకోవలోనే నటన నుంచి దర్శకత్వం వైపు అడుగులు వేశాడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమా ‘చి.ల.సౌ’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరుకు జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన ‘మన్మథుడు 2’ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

నాగార్జున కెరీర్ లోనే ‘మన్మథుడు’ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ సినిమా చేశాడు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ కాస్ట్ ఉన్నా.. ఈ సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు రాహుల్. దీంతో డైరెక్షన్ నుంచి నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు.

నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్.. ‘ది గాళ్ ఫ్రెండ్’తో డైరెక్టర్ గా హిట్ కొడతాడేమో చూడాలి.

Related Posts