చీర కట్టుకుని ‘పుష్ప‘ స్టెప్పేస్తే..

అల్లు అర్జున్ డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న బెస్ట్ డ్యాన్సర్స్ లో ఖచ్చితంగా మొదటి మూడు స్థానాల్లో ఉండే హీరో బన్నీ. తన స్టెప్పుల్లో ఎప్పుడూ మొనాటనీ కనిపించకుండా సినిమా సినిమాకీ సరికొత్త స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తుంటాడు. అందుకే బన్నీని అంతా స్టైలిష్ స్టార్ అంటారు. అయితే.. ‘పుష్ప‘ సినిమాలోని తన మేకోవర్ తో, యాక్టింగ్ తో ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుని స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

‘పుష్ప‘ ఫస్ట్ పార్ట్ పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప‘ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అంతకుమించి అన్నట్టు పాటలను తీర్చిదిద్దుతున్నాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. లేటెస్ట్ గా ‘పుష్ప 2‘ కోసం ఓ జాతర ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా వచ్చే సాంగ్ లో చీరకట్టుకుని పుష్ప గెటప్ లో అల్లు అర్జున్ వేసే స్టెప్పులే అదిరిపోతాయట. ఈ స్టెప్స్ వేయడం వలన బన్నీకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందని చెబుతున్నారు. ఆ లెవెల్ లో ఆ స్టెప్స్ ఉన్నాయట. మొత్తంమీద ‘పుష్ప.. ది రూల్‘లో జాతర పాటకు థియేటర్లు దద్దరిల్లిపోతాయన్నమాట.

Related Posts