మామయ్య అన్న ప్రతి మాటా నాకు వినిపించింది – సాయితేజ్

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయితేజ్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ.. ‘నాకు కళ్యాణ్‌ మామయ్య ఫోన్ చేశారు. మనం మల్టీస్టారర్ చేస్తున్నాం రా.. నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు. నేను ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను ఒప్పుకోను మామయ్యా అని చెప్పా. కానీ ఆయన మళ్లీ చెప్పాడు. నేను కూడ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఒప్పుకోలేదు. కానీ నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు.

కానీ సముద్రఖని గారు అద్భుతంగా చేశారు. ఇదీ మొన్న జరిగింది. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను 12 రోజులు కోమాలో ఉన్నాను. ఆ టైమ్ లో ఆయన ప్రతి రోజూ హాస్పిటల్ కు వచ్చి నా చేయి పట్టుకుని నీకేం కాదురా అన్నాడు. అది నాకు వినిపించింది. థ్యాంక్యూ మామయ్యా.. ఇక సినిమా విషయానికి వస్తే..అందరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది.

ఇది మా సినిమా అని కాలర్ ఎగరేసుకుని తొడలు కొట్టుకునేలా ఉంది.ఈ సినిమాకు ముందు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు వెంకీమామ అనే సినిమా తీశారు. అందులో మేనమామ, మేనల్లుడుతో తీశారు. ఇప్పుడు మరోసారి మాతో సినిమా చేశారు. సముద్రఖని గారు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ. త్రివిక్రమ్ గారుకి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. మా టెక్నీషియన్స్ తో పాటు నీతా లుల్లా గారికి థ్యాంక్యూ సో మచ్. మా బ్రో.. మా గురువు గారు, మా మామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నా తమ్ముడు, వరుణ్ కి థ్యాంక్యూ సో మచ్.. నా అభిమానులు, నేను ఈ స్టేజ్ మీదికి రావడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలకు థ్యాంక్యూ.. ” అన్నాడు.

Related Posts