ధనుష్ తో భారీ తెలుగు మల్టీస్టారర్

ధనుష్‌.. మోస్ట్ టాలెంటెడ్ స్టార్. ఎంచుకునే కథలే వైవిధ్యంగా ఉంటాయి. ఆ పాత్రల్లో అతను జీవించేస్తాడు. తన కటౌట్ తో సంబంధం లేకుండా యాక్షన్ మూవీస్ లో కూడా ఇరగదీస్తుంటాడు. అందుకే అతనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బేస్ ను పెంచుకునేందుకు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ ఫస్ట్ మూవీకే బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు. అట్నుంచి హాలీవుడ్ కూ వెళ్లాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 50వ సినిమా అనే మైల్ స్టోన్ కు రీచ్ అయ్యాడు ధనుష్‌.

దానికి ముందు నటించిన కెప్టెన్ మిల్లర్ అనే సినిమా టీజర్ రాబోతోంది. మరోవైపు బాలీవుడ్ లో రాంఝనాకు సీక్వెల్ అనౌన్స్ అయింది. అయితే ఈ అన్నిటికంటే ముందే అనౌన్స్ అయిన సినిమా శేఖర్ కమ్ములది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ నటిస్తున్నాడు అన్నప్పుడే ఇది శేఖర్ కమ్ములకు బెంచ్ మార్క్ మూవీ అవుతుందీ అనుకున్నారు.


అనుకున్నట్టుగానే ఎప్పుడూ లేనంతగా ఈ కథ కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నాడు శేఖర్. అయితే మొదట ధనుష్ తో మాత్రమే అనుకున్న కథకు ఇప్పుడు మరో స్టార్ కూడా అవసరం అయ్యాడు. అంటే మల్టీస్టారర్ సబ్జెక్ట్ అయింది. దీనికి ధనుష్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే తెలుగు నుంచి నాగార్జునను తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగ్ ప్రస్తుతం ఓ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. సరైన హిట్ పడాలంటే మంచి కథ కావాలి.

ఎదురుచూస్తున్నాడు. ఈ టైమ్ లో శేఖర్ కమ్ముల, ధనుష్‌ తో సినిమా అంటే నాగ్ కు చాలా పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఆల్రెడీ ఆయన ఓకే చెప్పాడు. ఈ పాత్రకు నాగ్ అయితేనే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని టీమ్ మొత్తం భావించారట. అందుకే ధనుష్ ను కూడా ఒప్పించి నాగ్ ను తీసుకున్నారు. ఇక ధనుష్‌ సరసన రష్మిక మందన్నా ఫిక్స్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ ను ఓకే చెప్పాడు. రెహ్మాన్ ఇప్పుడు గతంలో లాగాబిజీగా లేడు.


కాబట్టి ఓకే అనేశాడు. ఆల్రెడీ రామ్ చరణ్‌ – బుచ్చిబాబు సినిమాకు అతనే సంగీత దర్శకుడు. ఇక నాగార్జున ఓకే అన్న వెంటనే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొత్తంగా నాగార్జున కెరీర్ కు కూడా ఇది కొత్త టర్న్ ఇస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. బట్ నాగ్ – ధనుష్‌, రష్మిక మందన్నా, ఏఆర్ రెహ్మాన్ అనే కాంబినేషన్ మాత్రం అంచనాలను పెంచుతోంది.

Related Posts