నవ యువ సామ్రాట్ కి బర్త్ డే విషెస్

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ను అందించడంలో అక్కినేని హీరోలు ఆరితేరారు. నాగేశ్వరరావు నుంచి నాగార్జున.. ఇప్పుడు నాగచైతన్య ఈరూటులోనే పయనిస్తున్నారు. అందుకే నాగచైతన్యను నవ యువ సామ్రాట్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. 2009లో ‘జోష్’ సినిమాతో పరిచయమైన చైతూకి రెండో సినిమా ‘ఏమాయ చేసావె’తో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ‘100 పర్సెంట్ లవ్’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో స్టెడీ హిట్స్ తో దూసుకెళ్తూ.. అక్కినేని బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్తున్న చైతన్య కెరీర్ లో ‘మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు’ వంటి విజయాలున్నాయి. ‘బంగార్రాజు’ తర్వాత చైతూకి అంతగా కలిసిరాలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘థ్యాంక్యూ, కస్టడీ’ సినిమాలు నిరాశపరిచాయి. ‘లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ కి బడా ఎంట్రీ ఇచ్చినా అక్కడా నిరాశ తప్పలేదు.

ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షనలో ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకోసం సరికొత్త మేకోవర్ తో సందడి చేయబోతున్నాడు. లేటెస్ట్ గా నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు.. డిసెంబర్ 1 నుంచి చైతన్య డెబ్యూ వెబ్ సిరీస్ ‘ధూత’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తమ ఫ్యామిలీకి మెమరబుల్ ‘మనం’ అందించిన విక్రమ్ కుమార్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. మొత్తంమీద.. ‘ధూత’ వెబ్ సిరీస్.. పాన్ మూవీ ‘తండేల్’తో చైతన్య మంచి ఫామ్ లోకి రావాలని ఆశిస్తూ.. నవ యువ సామ్రాట్ కి బర్త్ డే విషెస్ తెలియజేద్దాం.

Related Posts