‘గామి‘ చిత్రం పెద్దలకు మాత్రమే.. అసలు కారణం అదే..

మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విశ్వక్ సేన్ ‘గామి‘. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘గామి‘పై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి ‘ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మన తెలుగులో వచ్చే కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ‘యు/ఎ‘ సర్టిఫికెట్స్ లభిస్తుంటాయి. చాలా అరుదుగా మాత్రమే క్లీన్ ‘యు‘ సర్టిఫికెట్స్ వస్తుంటాయి.

ఇక.. ‘సలార్‘ తర్వాత ‘ఎ‘ సర్టిఫికెట్ తో వస్తోన్న క్రేజీ మూవీ ‘గామి‘ అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఆద్యంతం అఘోరాల కథాంశంతో తెరకెక్కింది. అందు వలనే ఈ మూవీకి ‘ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ లో ఎక్కువగా కనిపించిన విశ్వక్ సేన్ చేసిన ఓ విభిన్నమైన ప్రయత్నం ‘గామి‘. ఈ మూవీలో చాందిని చౌదరి మరో కీలక పాత్రలో నటించింది. కార్తీక్ శబరీష్ నిర్మాణంలో విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ సమర్పిస్తుండడం విశేషం

Related Posts