పాటల పండగ మొదలెడుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్‘

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను మళ్లీ ఫామ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే. అలాంటి ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా రాబోతుంది ‘డబుల్ ఇస్మార్ట్’. మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ మాస్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ అవుతోంది.

‘ఇస్మార్ట్ శంకర్‘ విజయంలో రామ్, పూరి జగన్నాథ్ లతో పాటు కీలక పాత్ర పోషించింది మ్యూజిక్. ఈ సినిమాకోసం మణిశర్మ అందించిన మాస్ ట్యూన్స్.. వాటికి రామ్ వేసిన స్టెప్స్ యువతను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్‘కి సైతం మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ‘డబుల్ ఇస్మార్ట్‘ పాటల పండగ మొదలవుతోంది. జూలై 1న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్‘ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తుంటేనే.. ఆ పాట ఊర మాస్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts