భారీ స్థాయిలో జరిగిన ‘దేవర‘ ప్రి-రిలీజ్ బిజినెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర‘ విడుదలకు వంద రోజుల ముందే అన్ని రకాల డీల్స్ ను క్లోజ్ చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట్రికల్ కి సంబంధించి అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట.

‘దేవర‘ సినిమాని నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్నాడట. ఇక.. కృష్ణా జిల్లా హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంటే.. ఉత్తరాంధ్ర పూర్వీ పిక్చర్స్, వెస్ట్ గోదావరి ఆదిత్య ఫిల్మ్స్, ఈస్ట్ విజయలక్ష్మి ఫిల్మ్స్, గుంటూరు రాధాకృష్ణన్ ఎంటర్ టైన్ మెంట్స్ పొందినట్టు తెలుస్తోంది. సీడెడ్ లో అయితే ‘దేవర‘ నాన్ రాజమౌళి రికార్డ్స్ ను కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతుంది. సీడెడ్ లో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్, వందన ఫిల్మ్స్, తాడిపత్రి శివ, సురేష్ కలిసి ‘దేవర‘ చిత్రాన్ని ఏకంగా రూ.25 కోట్లకు దక్కించుకున్నారట.

మొత్తంగా.. ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్ లో రూ.25 కోట్లు, నైజాంలో రూ.45 కోట్లు కలుపుకుని.. తెలుగు రాష్ట్రాల్లోనే ‘దేవర‘ రూ.125 కోట్లు ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇంకా.. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని హంసిని ఎంటర్ టైన్ మెంట్ రిలీజ్ చేయబోతుంది. ఓవర్సీస్ హక్కుల రూపంలో ‘దేవర‘కి రూ.27 కోట్లు దక్కాయట. నార్త్ లో ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దేవర‘ ఉత్తరాది హక్కులు రూ.50 కోట్లు అనే ప్రచారం ఉంది.

ఈ లిస్ట్ మొత్తం చూస్తుంటే.. ‘దేవర‘ థియేట్రికల్ గానే రూ.200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇంకా.. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనూ ‘దేవర‘ భారీగానే దక్కించుకుందట. ‘దేవర‘ సినిమా ఆడియో రైట్స్ ను టి-సిరీస్ దక్కించుకోగా, డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్, శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా పొందాయి. సెప్టెంబర్ 27న ‘దేవర‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts