‘కల్కి’పై ప్రశంసల జల్లు కురిపించిన చిరు, రాజమౌళి

ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టే చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 AD’ కూడా చేరుతుంది. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందిస్తోన్న ‘కల్కి’ గురించి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు.

వైజయంతీ సంస్థతో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ సంస్థలో చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలనివుంది, ఇంద్ర’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. చిరంజీవి తనయుడు చరణ్ కూడా ఇదే సంస్థ నుంచి హీరోగా పరిచయమయ్యాడు. లేటెస్ట్ గా ‘కల్కి’ సినిమాతో ఇండియన్ సినీ పతాకాన్ని గ్లోబల్ లెవెల్ లో ఎగురవేస్తున్న చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు చిరంజీవి.’కల్కి 2898 AD’ గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయని.. ఈ సందర్భంగా చిత్రబృందంతో పాటు తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.

ఇక.. దర్శకధీరుడు రాజమౌళి ‘కల్కి 2898 AD’ని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘కల్కి ‘ చిత్రం ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని.. డార్లింగ్ తన టైమింగ్ తో, నటనా ప్రతిభతో చంపేశాడంతే!’ అంటూ రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టాడు. అలాగే.. అమితాబ్, కమల్, దీపిక గొప్పగా నటించారని.. ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు అయితే.. తనను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది’ అంటూ తన పోస్ట్ లో వివరించాడు రాజమౌళి. ఈ సందర్భంగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ బృందానికి శుభాభినందనలు’ తెలియజేశాడు రాజమౌళి.

Related Posts