డ్రగ్స్ రహిత సమాజం కోసం చిరంజీవి సైతం

తెలంగాణలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని చిరంజీవి ఓ అవగాహనా వీడియోలో నటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఈ వీడియోలో కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతారని, బాధితులను శిక్షించడం కన్నా రక్షించడమే ప్రధానంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుందని వివరించారు.

Related Posts