నమ్మండి.. ఈ విగ్రహం ప్రభాస్ దేనండీ..

విగ్రహం అనగానే ఆయా వ్యక్తుల ప్రతి రూపంగానే చూస్తాం. అందుకే ఆ రూపం ఖచ్చితంగా ఉండాలి. లైవ్ లీగా ఉంటూనే.. పోలికలూ అచ్చంగా సరిపోవాలి. ఇంకా చెబితే పోలికలు సరిపోతేనే విగ్రహంలో జీవ కళ ఉట్టిపడుతుంది. బట్ కొన్నిసార్లు ఇది మిస్ ఫైర్ అవుతుంది. ఆ మధ్య సమంత విగ్రహం పెట్టాడు ఓ అభిమాని.

అతని అభిమానం గొప్పదే.. కానీ సమంత ఎక్కడ అంటూ సెటైర్స్ వేశారు కొందరు. ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ అదే జరుగుతోంది. తాజాగా కర్ణాటకలోని మైసూర్ లో ప్రభాస్ విగ్రహాన్ని వాక్స్ మ్యూజియంలో పెట్టారు.

కటౌట్ చూస్తే బాహుబలి నుంచి తీసుకున్నారు. కానీ రూపం మాత్రం ప్రభాస్ ది కాదు. ఎవరో బాహుబలి గెటప్ వేసుకున్నట్టుగా ఉంది తప్ప.. పోలికల్లోనూ, రూపంలోనూ ఎక్కడా ప్రభాస్ కనిపించడం లేదు. దీంతో వాక్స్ కరిగిపోతుందేమో.. అందుకే ప్రభాస్ రూపం అవుట్ ఆఫ్ షేప్ అయింది అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయి.


ఇండియా మొత్తం ఫేమ్ అయిన ఓ టాప్ స్టార్ విగ్రహాన్ని మ్యూజియమ్ లోనో మరో చోటో పెడుతున్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి. కోట్లమందికి తెలిసిన వ్యక్తి రూపం తేడాగా వస్తే వారి ప్రయత్నమే అపహాస్యం పాలవుతుంది.ఇప్పుడు ప్రభాస్ విషయంలో జరిగింది ఇదే. విశేషం ఏంటంటే.. ఆ ప్రభాస్ పక్కనే ఉన్న విగ్రహం చూస్తే వెంటనే ప్రఖ్యాత ఇంజినీర్, భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని ఇట్టే గుర్తుపట్టేలా ఉంది. బట్ ప్రభాస్ విగ్రహమే.. అభిమానులు నిగ్రహం కోల్పోయేలా ఉంది.

Related Posts