జబర్దస్త్ కమెడియన్ కు బేడీలు

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన చాలామంది రకరకాల కేసుల్లో ఇరుక్కున్నారు అనేది అందరికీ తెలిసిందే. వీటిలో చాలా బయటకు రాలేదు కానీ.. మాగ్జిమం అమ్మాయిలను వేధించిన, లేదా మోసం చేసిన కేస్ లు ఉన్నాయని ఆ టీమ్ లో పనిచేసేవారే చెబుతుంటారు. అవన్నీ బయటకు రాలేదు.

కొందరైతే అమ్మాయిలకు టీమ్ లో చాన్స్ కావాలంటే ” మాకేంటీ..” అని కూడా అడుగుతుంటారు అనే టాక్ కూడా ఎప్పటి నుంచో ఉంది. అఫ్‌ కోర్స్ టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. తాజాగా ఆ టైమ్ వచ్చిన కేస్ లో జబర్దస్త్ తో పాటు వివిధ ప్రోగ్రామ్స్ లో కనిపించిన నవ సందీప్ అనే వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేశారు.


ఊరి నుంచి బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ఒక అమ్మాయి.. కొన్నాళ్లుగా హాస్టల్ లో ఉంటోంది. ఆమెకు ఈ నవ సందీప్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి సన్నిహితంగానూ ఉన్నారట.

కొన్ని రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన తెస్తే.. పట్టించుకోలేదట. దీంతో తను మోసపోయానని గ్రహించిన యువతి మధునా నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కొన్ని రోజుల క్రితమే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీస్ లు తాజాగా నవ సందీప్‌ ను అరెస్ట్ చేశారు. అయితే తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటాను అని నమ్మకంగా చెప్పడంతోనే తను కమిట్ అయ్యానని ఆ అమ్మాయి చెబుతోంది.

Related Posts