మలయాళం మూవీ రీమేక్ లో బాలకృష్ణ?

ఒక భాషలో సినిమా హిట్టయ్యిందంటే.. ఆ చిత్రాన్ని పరభాషల్లోకి తీసుకెళ్లడానికి నిర్మాతలు పోటీపడుతుంటారు. ఈ కోవలోనే ఇప్పుడు మలయాళం హిట్ మూవీ ‘ఆవేశం‘ కోసం ప్రతీ భాషలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. తెలుగులో అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ‘ఆవేశం‘ సినిమా ఏప్రిల్ 11న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇంకా.. ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతూనే ఉంది.

ఆద్యంతం బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ‘ఆవేశం‘ సినిమా రూపొందింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా జితు మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ రంగా రోల్ లో అదరగొట్టాడు ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు ‘ఆవేశం‘ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే.. ఆ పాత్రకు నటసింహం బాలకృష్ణ సరిగ్గా సూటవుతాడని అంచనా వేస్తున్నారు నిర్మాతలు. త్వరలోనే.. ఈ మూవీ రీమేక్ ప్రపోజల్ బాలయ్య వద్దకు వెళ్లబోతుందట. మరి.. మలయాళం మూవీ ‘ఆవేశం‘ రీమేక్ కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి.

Related Posts