తెలంగాణ ఎమ్మెల్యేకు సపోర్ట్ గా బాలకృష్ణ

ఎవరు ఎప్పుడు ఏ హెల్ప్ అడిగినా ముందే ఉంటాడు నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ కు సంబంధించి ఎవరు అడిగినా కాదనడు అంటారు. అందుకు చిన్న పెద్ద భేదం చూపించడు. ప్రాపర్ గా ఆయన్ని అప్రోచ్ అయితే అప్పటి వరకూ అతనెవరో కూడా తెలియని హీరోల సినిమాల టీజర్స్ ను విడుదల చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలాంటిది ఒక ఎమ్మెల్యే అడిగితే కాదంటాడా.. ? తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజాగా రుద్రంగి అనే చిత్రాన్ని నిర్మించాడు. స్వాతంత్రం తర్వాత తెలంగాణ ప్రాంతంలో కొందరు దొరల అరాచకాలు ఎలా ఉన్నాయి అనే కోణంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. జూలై 7న విడుదల కాబోతోన్న రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ రాబోతున్నాడు.


జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, ఆశిష్‌ గాంధీ, గణవి లక్ష్మణ్, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అజయ్ సమ్రాట్ డైరెక్ట్ చేశాడు. రసమయి బాలకిషన్ ఇంతకు ముందు కూడా ఓచిత్రాన్ని నిర్మిచాడు. తుపాకీ రాముడు అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఇప్పుడు రెండో ప్రయత్నం చాలా గ్రాండ్ గానే చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత చాలామంది దీని బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రసమయికి ఇంత గ్రాండీయర్ గా సినిమా చేసేంత ఫైనాన్సియల్ సపోర్ట్ ఎలా వచ్చిందని చర్చించుకుంటున్నారు.

ఏమైతేనేం సినిమాల్లో రాణించాలనేది అతని కల. ఆ కలను ఇలా నిర్మాతగా నెరవేర్చుకుంటున్నాడు. ఆ ప్రయత్నానికి అండగా బాలయ్య ఈ గురువారం సాయంత్ర హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నాడు.

Related Posts