అక్కడ అతను చెబితేనే పగలైనా, రాత్రైనా

సౌత్ ఇండియా మొత్తం ఇమేజ్ తెచ్చుకుని ప్రతి సినిమా కథతోనే మెస్మరైజ్ చేసే హీరోలు ఒకరో ఇద్దరో ఉన్నారు. వారిలో ముందుంటాడు దుల్కర్ సాల్మన్. మళయాలంలో మొదలుపెట్టి, తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేసి హిట్స్ కొట్టిన హీరో అతను.

తెలుగులో చాలా తక్కువ టైమ్ లో తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన సీతారామంతో తెలుగు ఆడియన్స్ ను మనసులు మరింతగా దోచుకున్నాడు. మమ్మూట్టి తనయుడుగా వచ్చినా.. తనదైన ముద్రను బలంగా వేసిన దుల్కర్ ఇప్పుడు కంట్రీ మొత్తం ఫేమ్ అయిన ప్యాన్ ఇండియన్ స్టార్.

అందుకే అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యాన్ఇండియన్ సినిమాగానే వస్తోంది. పేరు ” కింగ్ ఆఫ్ కొత్త”. లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్‌ బాబు విడుదల చేశాడు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందినట్టుగా టీజర్ చూస్తోంటే తెలుస్తోంది.

” అక్కడ ప్రజలంతా రాజుగారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. అతను మాత్రమే తమ భూములను, తమ పిల్లలను కూడా కబళించిన ఆ దెయ్యం నుంచి కాపాడతాడని వారి నమ్మకం. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. రాజా తిరిగి వచ్చాడు.” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ దుల్కర్ ఎంట్రీకి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చింది.

దుల్కర్ ఎంట్రీ తర్వాత.. అతను ” ఇది గాంధీకాలం కాదు. కొత్త. ఇక్కడ నేను చెప్పినప్పుడే పగలు, నేను చెప్పినప్పుడే రాత్రి.. “అని చెప్పే సినిమాలో దుల్కర్ ఆరాను తెలియజేస్తుంది. విలన్స్ కబళించిన ఒక ప్రాంతాన్ని కాపాడి తిరిగి ప్రజలకు అప్పగించే గొప్ప నాయ