‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ లాంఛ్ కి ఏర్పాట్లు

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే దసరా సందడి మొదలైంది. దసరా బరిలోకి వస్తోన్న చిత్రాల్లో నటసింహం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ ఒకటి. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ వంటి వరుస విజయాలతో ఉన్న బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అపజయమంటూ లేని అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘భగవంత్ కేసరి‘పై బజ్ అయితే మామూలుగా లేదు. గతంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో ‘భగవంత్ కేసరి‘ చేశాడు. టీజర్ లో ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా యేళ్లు యాదుంటది‘ అంటూ తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ‘గణేష్ ఏంథెమ్‘ సాంగ్ గణపతి ఉత్సవాల్లో మారుమ్రోగింది. అక్టోబర్ 4న ‘భగవంత్ కేసరి‘ నుంచి సెకండ్ సింగిల్ ను సైతం రిలీజ్ చేయబోతున్నారు.

అంతేకాకుండా బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ మాస్ ట్రీట్ కు సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ట్రైలర్ ను గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేయబోతున్నారట. అందుకోసం వరంగల్ ని వేదికగా ఎంచుకున్నారట మేకర్స్. త్వరలోనే ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ లాంఛ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.

Related Posts