అనుపమ కిట్టీలో అరడజను సినిమాలు

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ ఏడాది’టిల్లు స్క్వేర్’లో లిల్లీగా గ్లామరస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది అనుపమ. ప్రస్తుతం అనుపమ కిట్టీలో ఏకంగా అరడజను సినిమాలున్నాయి.

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. అనుపమతో ‘ఆక్టోపస్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ తర్వాత ఈ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది. త్వరలోనే ఈ మూవీని పూర్తిచేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ వర్మ. అలాగే.. ఆమధ్య ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగులతో ‘పరదా’ అనే మూవీని అనౌన్స్ చేసింది అనుపమ. ‘పరదా’ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటితో పాటు.. లైకా ప్రొడక్షన్స్ లో ‘లాక్ డౌన్’ అనే సినిమా కూడా చేస్తోంది ఈ మలయాళీ బ్యూటీ. ఇవన్నీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కావడం విశేషం.

ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు.. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తున్న ‘బైసన్’లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే.. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక.. లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్సయ్యింది అనుపమ. మొత్తంమీద.. నేటితరం యువ కథానాయికల్లో అనుపమ జెట్ స్పీడులో దూసుకుపోతుంది.

Related Posts