‘కల్కి’ యూనివర్శ్ లో కమల్ సినిమా

సినిమాటిక్ యూనివర్శ్ అనే పదం ఈమధ్య ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విరివిగా వినిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది సౌత్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ వంటి వారు తమకంటూ ఓ సినిమాటిక్ యూనివర్శ్ ను సృష్టించుకుని.. అందులోని పాత్రలను ఆధారం చేసుకుని.. కొత్త సినిమాలకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో తాజాగా ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చేరబోతున్నాడట.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కల్కి 2898 ఎ.డి’ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం గురించి చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని.. అలాగే ‘కల్కి’ సిరీస్ మునుముందు కూడా కొనసాగుతుందని నిర్మాత అశ్వనీదత్ క్లారిటీ ఇచ్చేశారు. ‘కల్కి 2898 ఎ.డి’కి సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తామని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.

‘కల్కి’ సీక్వెల్ తర్వాత ఈ చిత్రంలో కమల్ పోషించిన యాస్కిన్ పాత్ర ప్రధానంగా ఓ చిత్రాన్ని తీసుకొస్తామని కూడా అశ్వనీదత్ తెలిపారు. ఈ మూవీలో విలన్ గా నటించిన యాస్కిన్ కథేంటి? అసలు అతను అంత పవర్‌ఫుల్ గా ఎలా మారాడు? అనే ఇతివృత్తంతో ఆ కథ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ‘కల్కి’ సిరీస్ లో ఇప్పటికే మూడు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

Related Posts