‘విడి 12‘ కంటే ముందే గౌతమ్ తిన్ననూరి మరో మూవీ?

‘జెర్సీ‘ సినిమాతో భారీ విజయాన్నందుకున్న గౌతమ్ తిన్ననూరి.. విజయ్ దేవరకొండతో కొత్త సినిమా మొదలుపెట్టాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది. అయితే.. విజయ్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ మూవీ పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతోంది. దీంతో ఈలోపులో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మరో చిన్న ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించం.. ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకెళ్లడం కూడా చకా చకా జరిగిపోయిందట.

విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ‘విడి 12‘ ఆలస్యమవుతుండడంతో సితార సంస్థలోనే గౌతమ్ తిన్ననూరి ఓ చిన్న సినిమాని మొదలుపెట్టాడట. సితార నుంచి వచ్చిన ‘మ్యాడ్‘ మూవీ తరహాలో ముగ్గురు నూతన కథానాయకులు ఈ సినిమాలో నటిస్తున్నారట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్యాచ్ వర్క్స్ మినహా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పూర్తిైనట్టు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.

Related Posts