‘అర్జున్ రెడ్డి‘ ఫ్లేవర్ తోనే ‘యానిమల్‘

వెండితెరపై ఒక్కో దర్శకుడిది ఒక్కో సంతకం. కొన్ని తరహా సీన్స్ చూస్తే ఇది ఫలానా దర్శకుల బ్రాండ్ అంటూ ఇట్టే చెప్పగలుగుతాము. ఈకోవలనే.. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర సృష్టించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. హీరో యారగెంట్ క్యారెక్టరైజేషన్, బూతులు మాట్లాడటం.. అదే పనిగా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడం.. ‘అర్జున్ రెడ్డి‘లో కామన్ గా కనిపించే విజువల్స్. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి‘ రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్‘ విజయంలోనూ ఇవే ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

ఇప్పుడు ‘యానిమల్‘ సినిమాకి కూడా ఇదే ఫ్లేవర్ ని ఫాలో అవుతున్నాడు సందీప్ రెడ్డి. రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా రూపొందిన ‘యానిమల్‘ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ‘అమ్మాయి‘ అంటూ సాగే సింగిల్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో రణ్ బీర్, రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి మార్క్ అయిన ముద్దు సీన్స్ ఈ పాటలో హైలైట్. ఫ్యామిలీ అందరిముందే లీడ్ పెయిర్ లిప్ లాక్స్ తో మొదలైన ఈ సాంగ్.. ఆ తర్వాత ప్రైవేట్ జెట్ లో.. మంచు పర్వతాల్లో హృద్యంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను చూసిన వారు మరోసారి సందీప్ ‘అర్జున్ రెడ్డి‘ మ్యానియాని సృష్టించబోతున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న ‘యానిమల్‘ డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది.

Related Posts