తెరపైకి వచ్చిన ఎవరూ ఊహించని కాంబో..!

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన తరం హీరోల్లో విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎంతో ప్రత్యేకమైనది. హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా.. సినిమా సినిమాకి రౌడీ స్టార్ క్రేజ్ పెరుగుతూనే ఉంది.

‘ఫ్యామిలీ స్టార్’ నిరాశపరిచినా.. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ మాత్రం క్రేజీగా మారుతోంది. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టిన విజయ్.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్.. ఇప్పుడు నెట్టింట ఓ రేంజులో ట్రెండ్ అవుతోంది.

‘కె.జి.యఫ్’ సిరీస్, ‘సలార్’ సినిమాలతో ఇండియాలోని అతిపెద్ద దర్శకుల లిస్టులో చేరిపోయాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘సలార్ 2’తో బిజీగా ఉన్న ప్రశాంత్.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక చిత్రం, ‘కె.జి.యఫ్ 3’ వంటి ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నాడు. ఈ సినిమాలతో పాటు..

విజయ్ దేవరకొండ తోనూ ఒక చిత్రం చేయడానికి ప్రశాంత్ సమాయత్తమవుతున్నాడట. ఇప్పటికే విజయ్ తో సినిమాకి సంబంధించి ఓ స్టోరీ లైన్ ని కూడా రెడీ చేశాడట. అయితే.. ఎప్పటి లోగా వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కుతోంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related Posts