అల్లు అర్జున్ అరుదైన రికార్డ్

ఐకన్ స్టార్ గా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అల్లు అర్జున్. తనదైన శైలిలో ఏ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ సపోర్ట్ లేకుండా ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారాడు.పుష్పతో దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించనంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్పకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ చిత్రం చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ రేంజ్ లో పరిచయాలు పెంచుకుంటూ తన పిఆర్ టీమ్ సాయంతో కంట్రీ మొత్తం విస్తరించే ప్రయత్నంలో ఉన్న బన్నీ తాజాగా సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డ్ సాధించాడు.


సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు 50మిలియన్ ఫాలోవర్స్ చేరారు. సౌత్ లో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ హీరో అతనే కావడం విశేషం. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియన్ స్టార్స్ గా ఎదిగిన ఎవరూ ఈ ఫీట్ ను సాధించకపోవడం విశేషం. అల్లు అర్జున్ కు ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగానూ తిరుగులేని ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ను ఫాలో అవుతూ..

చాలామందికి ఇన్స్ స్పిరేషన్ గా నిలుస్తున్న అతను పుష్ప లాంటి పూర్తి డీ గ్లామర్ రోల్ చేయడం మొదట్లో ఆశ్చర్య పరిచినా ఈ చిత్రంతోనే దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. మొత్తం సోషల్ మీడియాలో 50మిలియన్ ఫాలోవర్స్ అంటే చిన్న విషయం కాదు. పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అయితే ఇంక ఈ ఫిగర్ చాలా పెరుగుతుందని వేరే చెప్పక్కర్లేదేమో. ఏదేమైనా ఈ ఫీట్ సాధించిన ఐకన్ స్టార్ కు తెలుగు 70ఎమ్ఎమ్ కంగ్రాట్స్ చెబుతోంది.

Related Posts