ఖైదీ పాత్రలో అదరగొడుతోన్న అజిత్

తమిళ అగ్ర కథానాయకులు తెలుగు నిర్మాతలతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే దళపతి విజయ్.. దిల్‌రాజు నిర్మాణంలో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఇప్పుడు తమిళ తల అజిత్.. మరో తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా సెకండ్ లుక్ రిలీజయ్యింది. ఈ పోస్టర్ లో ఖైదీ గెటప్ లో ఉన్నాడు అజిత్. ఇక.. ఈ పోస్టర్ రిలీజైన 24 గంటల్లోనే 62 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇదొక రేర్ రికార్డ్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరోవైపు.. అజిత్ నటిస్తున్న ‘విదా ముయార్చి’ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబర్ 31న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్నాడు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అజిత్‌ కి జోడీగా త్రిష నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో అర్జున్ సర్జా, రెజీనా, ఆరవ్ కనిపించబోతున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.

Related Posts