వెంకీ 75 కి ఇంకా 75 రోజులు

వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’. తన ప్రెస్టేజియస్ 75వ సినిమా ‘సైంధవ్’ కోసం వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు వెంకీ. ‘హిట్’ సిరీస్ తో డైరెక్టర్ గా తన విలక్షణతను చాటుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ‘సైంధవ్’ నుంచి టీజర్ రిలీజయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సైంధవ్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. దీంతో మరోసారి విడుదల తేదీని గుర్తు చేస్తూ.. వెంకీ 75 కి ఇంక కేవలం 75 రోజులు మాత్రమే ఉందంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ‘సైంధవ్’ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు పోస్టర్ లో తెలిపారు.

బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తుంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts