SSMB28 : కృష్ణగారి సినిమాలో మహేష్ బాబు టైటిల్ గ్లింప్స్

అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 28’(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల మహేష్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కాంబోలో థర్డ్ మూవీ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదల చేసిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. మరోసారి వింటేజ్ మహేష్ బాబుని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇక కొన్ని రోజులుగా ఈ మూవీ టైటిల్ ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్‌స్ లోనూ ఓ క్యూరియాసిటీ ఉంది. ఎప్పట్లానే సూపర్ స్టార్ కృష్ణగారి మొదటి జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయబోతోంది మూవీ టీమ్. కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక్కడ మరో విశేషం ఉంది. కృష్ణ గారు నటించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4K లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28’ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో కూడిన గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు.

పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతుల �