మంచు మనోజ్ కు కరోనా

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకేం ఆరోగ్య సమస్యలు లేవనీ కేవలం కరోనా పాజిటివ్ గా మాత్రమే తేలిందని.. అభిమానులు ఆందోళన పడవద్దు అంటూ ట్వీట్ చేశాడు మనోజ్. సెలబ్రిటీస్ కు కరోనా పీక్స్ లో ఉన్న టైమ్ లో చాలామందికి వచ్చింది. కానీ ఈ టైమ్ లో మనోజ్ కు పాజిటివ్ రావడం కొంత విశేషమే అయినా.. అతను ఎక్కువగా చారిటీకి సంబంధించి లేదంటే ఏదైనా పబ్లిక్ కు ఉపయోగపడే పనుల్లో నిరంతరం జనాల్లో తిరుగుతుంటాడు. అందుకే పాజిటివ్ వచ్చిందనుకోవచ్చు.
ఇక సినిమాల పరంగా మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మష్మి అనే ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ మూవీ కరోనా ఫస్ట్ వేవ్ కంటే ముందే అనౌన్స్ అయింది. కానీ ఇత వరకూ ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనేదానికి సమాధానం లేదు. మరోవైపు ఈ సినిమా కోసం తనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు మనోజ్. అందుకే భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని చెప్పాడు. కరోనా వల్ల చాలా నిర్మాణాలు ఆగిపోయాయి. అందులో ఈ మూవీ కూడా ఒకటనుకోవచ్చు.
ఏదేమైనా మంచు మనోజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Related Posts