‘లక్కీ లక్ష్మణ్‘ చిత్రంలోని సాంగ్ విడుదల

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని “ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ సాంగ్ ను కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.

ఐయామ్ సో సారీ సారీ.. ఐయామ్ వెరీ సారీ సారీ..
నువ్వట్ల కన్నెర్ర జేసీ కోపంగా చూడకే నా బుజ్జి బంగారం
ఐయామ్ సో సారీ సారీ ఐయామ్ వెరీ సారీ సారీ
నన్నిట్ట తిప్పించుకుంటూ తప్పించుకోకే క్షమించు ఓ సా..రి
చాలా.. రిక్వెస్ట్ గా అడుగు…తున్నా మాటాడవా..
బేబీ… హనెస్ట్ గా వేడుకున్నా.. శాంతించవా..
ఈ అలకలు, చిలకలు చిటికెలు ఎగిరే దారే.. లేదా
ఓ… మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ.. మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ.. మేరీ జాన్ నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే..

అంటూ హీరోయిన్ కు సారీ చెప్పడానికి తన వెంటపడే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. బిగ్ బాస్ తరువాత హీరోగా నటిస్తున్న సోహైల్ సింపుల్ స్టెప్స్ తో వేసిన డ్యాన్స్ చాలా ఈజ్ గా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చ‌క్క‌గా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్