యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ… నార్త్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ మ‌ధ్య‌కాలంలో ఏ ఫేస్ బుక్ వాల్ మీద చూసినా ఒక సినిమా రివ్యూ క‌చ్చితంగా క‌నిపిస్తోంది. ఆ మూవీ పేరు సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌ను ప్రేమ‌గా మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. అందుకే ఇన్‌స్టా షాట్స్‌లోనూ, రీల్స్ లోనూ మ‌ళ్లీ మ‌ళ్లీ సీతారామం డైలాగులు, పాట‌లు క‌నిపిస్తున్నాయి. ద‌క్షిణాది జ‌నాల మ‌న‌సులు దోచుకున్న సీతారాముల క‌థ‌ను హిందీలోనూ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. సెప్టెంబ‌ర్ 2న హిందీ జ‌నాల‌ను మెస్మరైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.


హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కొత్త కాదు. నాయిక మృణాల్ అక్క‌డ‌మ్మాయే. దుల్క‌ర్‌, సుమంత్ చేసిన త‌ర‌హా మిలిట‌రీ కేర‌క్ట‌ర్ల‌కు ఇప్పుడు నార్త్ లో య‌మా క్రేజ్ ఉంది. ఆల్రెడీ నార్త్ సినిమాల షూటింగుల‌తోనే తల‌మున‌క‌ల‌వుతోంది మ‌న అఫ్రీన్ అలియాస్ ర‌ష్మిక మంద‌న్న‌.


నాయిక ప్రేమ‌గా నాలుగు ముక్క‌లు రాస్తే కాశ్మీర్‌ని మంచుకొదిలేసి హైద‌రాబాద్ బాట ప‌ట్టిన హీరో. అత‌ని కోసం ప్రిన్సెస్ అనే ప‌ట్టాన్ని కాల‌ద‌న్ని ఉత్త‌రాది వైపు ఉరికిన హీరోయిన్‌. వారిద్ద‌రి మ‌ధ్య అంద‌మైన ప్రేమ‌… ఆ ప్రేమ‌ను జాగ్ర‌త్త‌గా చేర‌వేసిన అఫ్రీన్‌.. అందంగా చెప్పాలంటే క‌థ ఇంతే. కానీ స్క్రీన్ మీద పొయ‌టిక్‌గా చెప్పాడు హ‌ను రాఘ‌వ‌పూడి. సీతారాముల కేర‌క్ట‌ర్ల‌తో చాలా సీక్వెల్స్ ప్లాన్ చేస్తాన‌న్న హ‌నుకి ఈ సినిమా ఉత్త‌రాదిలో ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.


అస‌లే కంటెంట్ ఉన్న సినిమాల‌కు నార్త్ ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న రోజులివి. మ‌న వాళ్లే చ‌ల్ల‌టి చ‌లిని వెచ్చ‌గా ఆహ్వానించారంటే, అక్క‌డివారు ప్రేమ‌క‌థ‌కు ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.
విశాల్ మ్యూజిక్‌కి త‌ప్ప‌కుండా హిందీలో హై రేంజ్ వెల్క‌మ్ ఉంటుంద�