గుర్రమెక్కి స్వారీ చేస్తున్న సంయుక్త

అందంతో పాటు అభినయంతోనూ అలరించే కథానాయికల్లో ముందు వరుసలో నిలిచే ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. తెలుగులో సెంట్ పర్సెంట్ సక్సెస్ రేటును సొంతం చేసుకున్న ఈ మలయాళీ బ్యూటీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎలాంటి కసరత్తులైనా చేస్తోంది. లేటెస్ట్ గా ‘స్వయంభు‘ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. సంయుక్త గుర్రమెక్కి స్వారీ చేస్తోన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

నిఖిల్ కథానాయకుడిగా ‘స్వయంభు‘ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకోసం వియత్నంలో మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు నిఖిల్. ఈ సినిమాలో నిఖిల్ చేసే కత్తిసాము హైలైట్ గా నిలవనుందట. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌ ఈ మూవీని నిర్మిస్తుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘కార్తికేయ 2‘ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు‘.

Related Posts