ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ టాక్.. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల న‌ట విశ్వ‌రూపం

ఆర్ఆర్ఆర్.. ట్రైల‌ర్ రిలీజైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్స్ తోనే అంచ‌నాలు పెంచేశారు. ఇక ట్రైల‌ర్ ఎలా ఉంటుందో..? కొత్త‌గా ఏం చూపించ‌నున్నారో..? అని ఆతృత‌గా ఎదురు చూసిన జ‌నాల‌కు అంత‌కు మించి అన్న‌ట్టుగా ట్రైల‌ర్ తో జ‌క్క‌న్న‌ విజువ‌ల్ ట్రీట్ అందించారు. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ పులితో ఫైట్ ఎలా ఉండ‌బోతుందో శాంపిల్ చూపించారు. అలాగే అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ ఎలా క‌నిపించ‌నున్నారో కూడా చూపించారు.

యాక్ష‌న్, ఎమోష‌న్, సెంటిమెంట్.. ఇలా అన్నింటినీ క‌లిపి క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ తో మ‌రోసారి జ‌క్క‌న్న స్టోరీ టెల్లింగ్ లో మాస్ట‌ర్ అనిపించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ క‌లిసి బాక్సాఫీస్ మీద దండ‌యాత్ర చేయ‌బోతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డులు అని తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయం అనిపిస్తుంది. ట్రైల‌ర్ ఎండ్ లో భీమ్ ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు.. కుంభ‌స్థలాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌దా.. అని చ‌ర‌ణ్ అన‌డం.. వీరిద్ద‌రూ క‌లిసి వేట‌కు వెళ్ల‌డం అదిరింది.

చ‌ర‌ణ్‌, తార‌క్ క‌లిసి చేసిన యాక్ష‌న్ సీన్స్ అయితే.. నెక్ట్స్ లెవ‌ల్ అన్న‌ట్టుగా ఉన్నాయి. ఎంఎం కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఆర్.ఆర్.ఆర్ కు ఆయువుపట్టుగా నిలిచాయి. అలాగే బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా మెప్పించారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియా కూడా ఆకట్టుకున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.

Related Posts