“ఆర్ఆర్ఆర్” స‌ర్ ప్రైజ్ అదిరింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దాన‌య్య నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ట్రైలర్ ని చిత్రబృందం డిసెంబర్‌ 3న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌ 9కి వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షకులు కాస్త నిరుత్సాహపడ్డారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. అది ఏంటంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమ‌రం భీమ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు రామ్‌చరణ్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు మేక‌ర్స్. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.

బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ట్రైల‌ర్ పై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మ‌రి.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Posts