రవితేజ ఆదుకోవడం లేదు.. ఆడుకుంటున్నాడా..?

అభిరుచి ఉన్న నిర్మాతకు అన్నీ ఎదురుదెబ్బలే తగిలితే కమర్షియల్ హిట్స్ సంగతి పక్కన బెడితే మంచి సినిమాలు మిస్ అవుతాం. ఈ మధ్య తెలుగులో చెరుకూరి సుధాకర్ అనే నిర్మాత పరిస్థితీ ఇలాగే ఉంది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్లూ మీకు జోహార్లు, విరాటపర్వం వంటి సినిమాలతో తనదైన టేస్ట్ ను చూపించారు సుధాకర్. కానీ ఈ చిత్రాలన్నీ కమర్షియల్ గా పోయాయి. ఇక లేటెస్ట్ గా ఎన్నో అంచనాలతో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ నిర్మాత కోసం మన మాస్ మహరాజ్ రవితేజ మరో మూవీ చేయబోతున్నాడు.


సినిమా పరిశ్రమ అనే మాటకు మొదటి అక్షరం నిర్మాత. ఆయన లేకపోతే ఇన్ని వేలమందికి ఉపాధి ఉండదు. కానీ ఇప్పుడు నిర్మాతలను రబ్బర్ స్టాంప్ లను చేశారు. అందుకే పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. వందేళ్ల సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా నిర్మాతలే ధర్నాలు, బంద్ లు చేస్తున్నారు. మరోవైపు సక్సెస్ అనే మాటే వినిపంచడం లేదు. దీంతో మరింత ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ఏళ్ల తరబడి పాతుకుపోయి పరిశ్రమను శాసిస్తోన్న వారి సంగతి ఓకే. కానీ సుధాకర్ లాంటి నిర్మాతలకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మరో సినిమా చేయలేడు. రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా తేలడంతో రవితేజ ఈ నిర్మాతకు తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదట. ఇంకా చెబితే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పి.. ఇంతకు ముందు తీసుకున్న రెమ్యూనరేషనే డిమాండ్ చేశాడు.


రవితేజ నిర్మాతకు ఆర్థికం ఆదుకోలేదు. కానీ సినిమాతో కవర్ చేయాలనుకుంటున్నాడు. యస్.. ఇదే నిర్మాతకు రవితేజ మరో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ సారి మంచి కథ, దర్శకుడిని చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతదే అన్నట్టుగా చెప్పాడట. దీంతో నిర్మాత సుధాకర్ ఓ దర్శకుడిని సెట్ చేయబోతున్నాడట. 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తీసిన మున్నా అనే దర్శకుడి కథ నచ్చడంతో దాదాపు అతనే ఫైనల్ అవ్వొచ్చు అంటున్నారు. అయితే రవితేజ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసురతో పాటు చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్యలోనూ నటిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ తర్వాత సుధాకర్ కు సినిమా చేస్తాడా లేక ఇమ్మీడియొట్ గా డేట్స్ ఇస్తాడా అనేది చూడాలి.రవితేజ ఇప్పటికైనా కథలపై కాస్త ఫోకస్ చేస్తే బెటర్. లేదంటే ఈ నిర్మాతకు మరో ఫ్లాప్ వస్తుంది. అప్పుడు అతను ఆదుకున్నట్టు కాదు.. అతని లైఫ్ తో ఆడుకున్నట్టు అవుతుంది.

Related Posts