ad

అఖండ విజయంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపిన నందమూరి బాలకృష్ణ.. అదే ఉత్సాహంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ లో వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది.


బాలయ్య కెరీర్ లోనే ఒక కొత్త పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని.. మూవీ లో ఆయన లుక్ కూడా అదిరిపోతోంది.. అఖండ కంటే ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని .. ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్స్ పెంచాడు డైరెక్టర్ గోపీచంద్.
మూలుగా బాలయ్య మూవీస్ తో పాటు టైటిల్ కూడా చాల పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెబితే టైటిల్ ను బట్టే సినిమాను అంచనా వేస్తారు ఫాన్స్. ఈసారి ఫాన్స్ కు బాగా ఇష్టమైన టైటిల్ తోనే వస్తున్నారని తెలుగు 70ఎమ్.ఎమ్ గతంలోనే రాసింది. ఇప్పుడు అదే నిజమైంది.
తెలుగు 70ఎమ్.ఎమ్ రాసినట్టుగానే ఈ మూవీ కి ” జై బాలయ్య” అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.బాలయ్య కనిపిస్తేనే జై బాలయ్య అని అరిచి ఈలలు వేస్తూ గోలలు చేస్తారు అభిమానులు మారె మాట టైటిల్ గా వస్తే ఇంకెంత కిక్ ఉంటుంది. సో బాలకృష్ణ , గోపీచంద్ మూవీ టైటిల్ 70 ఎమ్.ఎమ్ ముందే చెప్పినట్టుగా జై బాలయ్య అన్నమాట..

 

, , , , , , , , , , , , ,