జవాన్‌లో నయన్‌ మెయిన్‌ హీరోయిన్‌ కాదా

నార్త్ నుంచి ఆఫర్లు నాన్‌స్టాప్‌గా క్యూ కట్టినా ఒకప్పుడు పట్టించుకోలేదు నయనతార. నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు అక్కడికి ఎందుకు? అంటూ వచ్చిన ప్రతి ఆఫర్‌నీ పక్కనపెట్టేశారు. కానీ ఏకంగా షారుఖ్‌ సినిమాలో హీరోయిన్ అనగానే రీసెంట్‌గా డాటెడ్‌ లైన్స్ లో సంతకం చేశారు. అట్లీ డైరక్టర్‌ కావడంతో, తనకు కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని కూడా అనుకున్నారు నయన్‌. కానీ, ఇప్పుడు నయన్‌ ఫ్యాన్స్ జవాన్‌ విషయంలో వినిపిస్తున్న మరో విషయంతో హర్ట్ అవుతున్నారు.

జవాన్‌ సినిమాలో దీపిక పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారట. ఆమె పార్ట్ షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసేశారు అట్లీ. ఇప్పుడు మద్రాసు అండ్‌ ముంబై సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఇది. మరి షారుఖ్‌ పక్కన దీపిక నటిస్తే, నయనతార మాటేంటి? అసలు నయనతార కథని, కేరక్టర్‌నీ తెలుసుకునే సంతకం చేశారా? లేకుంటే పెళ్లి హడావిడిలో పడి ముందూ వెనుక చూసుకోకుండా కమిట్‌ అయ్యారా? ఫస్ట్ టైమ్‌ బాలీవుడ్‌లో నటిస్తున్న సినిమాను మరో హీరోయిన్‌తో షేర్‌ చేసుకోవడం ఏంటి? అంటూ నెట్టింట్లో గట్టిగా చర్చ జరుగుతోంది.

జవాన్‌లో షారుఖ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారని, అందులో ఓ కేరక్టర్‌కు భార్యగా దీపిక కాసేపు కనిపిస్తారని, సినిమా అంతా నయనతార కేరక్టరే కీలకం అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆన్‌లైన్‌ డిస్కషన్స్‌కి ఆన్సర్లు ఇచ్చేటంత తీరిగ్గా లేరు నయనతార. ప్రస్తుతం విఘ్నేష్‌తో సెకండ్‌ హనీమూన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి రాగానే జవాన్‌ సెట్లో అడుగుపెడతారు.

Related Posts